Godavarikhani | గోదావరిఖనిలో అట్టహాసంగా పద్మశాలీ సేవా సంఘం ప్రమాణ స్వీకారం.. హాజరైన ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్, సినీ నటుడు సాగర్
గోదావరిఖనిలో పద్మశాలీ సేవా సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. అధ్యక్షుడిగా అనుమ రాజమల్లు, ప్రధాన కార్యదర్శి బూర్ల దామోదర్, కోశాధికారి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు బూర్ల లలిత, ప్రధాన కార్యదర్శి మునుకుంట్ల రజిత, కోశాధికారి గాజుల రజిత, యువజన అధ్యక్షుడిగా మాటేటి సతీశ్, ప్రధాన కార్యదర్శిగా బండారి వేణు, కోశాధికారిగా రవీందర్ చే రాష్ట్ర అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయించారు.
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 29 : గోదావరిఖనిలో పద్మశాలీ సేవా సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. అధ్యక్షుడిగా అనుమ రాజమల్లు, ప్రధాన కార్యదర్శి బూర్ల దామోదర్, కోశాధికారి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు బూర్ల లలిత, ప్రధాన కార్యదర్శి మునుకుంట్ల రజిత, కోశాధికారి గాజుల రజిత, యువజన అధ్యక్షుడిగా మాటేటి సతీశ్, ప్రధాన కార్యదర్శిగా బండారి వేణు, కోశాధికారిగా రవీందర్ చే రాష్ట్ర అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ముఖ్యతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. వైదిక ఆచారాలు పాటించడంతోపాటు అత్యంత ప్రాచీనమైన, ఘనమైన చరిత్ర పద్మశాలీలకు ఉందన్నారు. అద్భుతమైన చేనేత కళానైపుణ్యంతో భారతదేశానికి వస్త్రంను అందించిన ఘనత పద్మశాలీలదేనన్నారు. బ్రిటీష్ పాలనలో విదేశి వస్త్రాలను బహిష్కరించి స్వదేశి ఖాదీ, చేనేత వస్త్రాలను ప్రోత్సహించే ఉద్యమంలో పద్మశాలీలు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
సమాజ అభివృద్ధిలో పద్మశాలీలు ఐక్యంగా ఉండాలన్నారు. పద్మశాలీలు శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా రామగుండంలో పద్మశాలీ సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విశిష్ట అతిథిగా సినీ నటుడు సాగర్ హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళీ స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు కామర్త మురళీ, ఉపాధ్యక్షులు గుండేటి రాజేష్, జిల్లా అడాక్ కమిటీ కన్వీనర్ నీలయ్య, హాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, గడ్డం జగన్నాథం, రాంచందర్, మెతుకు సత్యం, వలస రమేష్, సిరిమల్ల మధుతోపాటు కార్పొరేటర్లు, అధిక సంఖ్యలో కులస్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
AP News | పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కాంగ్రెస్-టీడీపీ బాహాబాహీ..!
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

