Kamanpur | కమాన్‌పూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.. బీఆర్ఎస్
కమాన్ పూర్ మండల పరిధిలో వరి పంటలు కోతల సమయం వచ్చినప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
- తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందజేసిన నాయకులు
Kamanpur | కమాన్ పూర్, నవంబర్ 5 : కమాన్ పూర్ మండల పరిధిలో వరి పంటలు కోతల సమయం వచ్చినప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కమాన్‌పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి గురువారం బీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా ప్రభుత్వ మండల ప్రజా పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకుని త్వరితగతిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల విక్రయ ఇబ్బందులు తొలిగించాలని కోరుతూ తహసీల్దార్ వాసంతి, ఎంపీడీవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ వంశీకృష్ణకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. మండలంలో వరి కోతలు జరుగుతున్నప్పటికీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ధాన్యం విక్రయించడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో మధ్య దళారులను ఆశ్రయించి రైతులు నష్టపోయే పరిస్థితి నెలకుందన్నారు. పక్కన పెద్దపల్లి నియోజకవర్గంలో వారం రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికి మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గంలోని కమాన్ పూర్ మండలంలో ఇప్పటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా మండలం పరిధిలో సెర్ఫ్, పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లేని యెడల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తాటికొండ శంకర్, నాయకులు గుర్రం లక్ష్మీమల్లు, కొండ వెంకటేష్, చిందం తిరుపతి, రాచకొండ రవి, నీలం శ్రీనివాస్, జాబు సతీష్, తోట రాజ్ కుమార్, రాచకొండ చంద్రమౌళి, పెండ్లి నారాయణ, పొట్ల సతీష్, కొయ్యడ సంపత్, పంతకాని రవి, నడిగొట్టు సంపత్, పొట్ల శంకర్, కొండిల్ల ఓదెలు, గుర్రం శంకర్, ఒడ్నాల సతీష్, షేక్ మొహినుద్దీన్, దండే రమేష్ ఠాగూర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మురుసు తుఫాను బాధితులను తక్షణమే ఆదుకోవాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ నిర్మాతకు భారీ నష్టాలు.. అసలు బ్రేక్ ఈవెన్ అన్నా అవుతుందా?
Ala Venkateswar Reddy | కాంగ్రెస్ అసమర్థతతో ఎండిన పంటలు : మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్‌రెడ్డి
IPL: చెన్నై జట్టులోకి ఎస్ఆర్హెచ్ బ్యాటర్.. 7 కోట్లు వదులుకున్న లివింగ్‌స్టోన్
Anjaiah Yadav | ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

