పోలీస్ భవనాలు రెడీ
గోదావరిఖని నగరంలో రూ.3.40 కోట్ల సింగరేణి నిధులతో చేపట్టిన నూతన మోడల్ పోలీస్స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 11న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు
- అత్యాధునిక హంగులతో నిర్మాణం
- 11న రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ చేతుల మీదుగా ప్రారంభం
గోదావరిఖని, అక్టోబర్ 6: గోదావరిఖని నగరంలో రూ.3.40 కోట్ల సింగరేణి నిధులతో చేపట్టిన నూతన మోడల్ పోలీస్స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 11న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. కాగా, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ స్థలంలోనే ఈ మోడల్ పోలీస్ స్టేషన్ను అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఇందుకు సింగరేణి రూ.3.40 కోట్లు నిధులు సమకూర్చిం ది.
పాత డిగ్రీ కళాశాల స్థలంలో పోలీస్ విశ్రాంతి భవనాన్నీ అత్యాధునిక వసతులతో నిర్మించారు. ఇందుకు ఎన్టీపీసీ సంస్థ రూ.3.50 కోట్లు సమకూర్చింది. అంతర్గాంలో మోడల్ పోలీస్ స్టేషన్కు రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.1.50కోట్లతో నిర్మించారు. ఈ భవనాల నిర్మాణాలు గతంలోనే పూర్తి కాగా, పరిస్థితులు అనుకూలించక ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో పోలీస్ హౌసింగ్ కార్పొరేష న్ చైర్మన్ కోలేటి దామోదర్ సీఎం దృష్టికి తీసుకవెళ్లి ప్రారంభించి వినియోగంలోకి తేవాలని విన్నవించగా ఎట్టకేలకు 11వ తేదీన ప్రారంభం చేయనున్నారు. రాష్ట్ర హోంమంత్రి, డీజీపీలతో పాటు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎంపీ వెంకటేశ్ కూడా హాజరవుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గోదావరిఖనిలోనే అత్యధిక కేసులు నమోదయ్యే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆధునీకరించి మోడల్ స్టేషన్ నిర్మించడంలో కోలేటి దామోదర్ కృషి చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

