Grand ceremony | కోరుట్ల, జూలై 5: పట్టణంలోని సోమవంశ సహసర్జన క్షత్రియ సమాజ్ ( పట్కారి ) సంఘ కార్యాల యంలో ఆ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ్ సంఘం నూతన అధ్యక్షుడిగా ధోండి నందలాల్, ప్రధాన కార్యదర్శి గా శికారి గోపికృష్ణ, కోశాధికారిగా జమన్ జ్యోతి రాజేంద్రప్రసాద్ లు ప్రమాణ స్వీకారం చేశారు.
నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు శాలువతో సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు నందలాల్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి అందరి సహాయ సహకారాలతో నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు శికారి విశ్వనాథం, సంఘం నాయకులు శికారి విజయ్, గంటెడి శ్రీనివాస్, జమన్ జ్యోతి శ్రీనివాస్, బచ్చావల సంజీవ్, బదాం పురుషోత్తం, చావ్ల లక్ష్మీనారాయణ, బచ్చవాల కిషన్, గంగా మోహన్, బచ్చవాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు .