సర్వే సరి.. పరిహారం ఏదీ.. ‘మొంథా’ తుఫాన్‌తో ఉమ్మడి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం
మొంథా తుఫాన్ అక్టోబర్, నవంబర్ నెలల్లో విరుచుకుపడింది. ఉమ్మడి జిల్లాలపై ప్రభావం చూపింది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో నీటిలో మునుగగా, అప్పటికే కోతలు పూర్తయి చేసిన వరి కుప్పలు కొట్టుకుపోయాయి. ఇటు కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యపు రాశులు తడిసిపోయాయి.
- ఎకరాకు రూ.పది వేల చొప్పున అందిస్తామన్న ప్రభుత్వం
- సర్వే చేసి నెలలు గడుస్తున్నా అందని పరిహారం
- ఆందోళనలో రైతాంగం
చిగురుమామిడి/ సైదాపూర్, జనవరి 6 : మొంథా తుఫాన్ అక్టోబర్, నవంబర్ నెలల్లో విరుచుకుపడింది. ఉమ్మడి జిల్లాలపై ప్రభావం చూపింది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో నీటిలో మునుగగా, అప్పటికే కోతలు పూర్తయి చేసిన వరి కుప్పలు కొట్టుకుపోయాయి. ఇటు కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యపు రాశులు తడిసిపోయాయి. కొన్నిచోట్ల కాలువలు, చెరువులకు గండ్లు పడి పంటలు కొట్టుకుపోయాయి. దీంతో అన్నదాతకు కన్నీరే మిగిలింది. అప్పుడు పంట దెబ్బతిన్న రైతులకు ఎకరానికి 10వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, సర్వేకు ఆదేశించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యవసాయ అధికారులు సర్వే చేసి, పంట నష్టం లెక్క తేల్చారు. ప్రభుత్వానికి కూడా నివేదించారు. ఒక్క చిగురుమామిడి మండలంలో 1793 ఎకరాల్లో వరి, సైదాపూర్ మండలంలో 2448.16 ఎకరాల్లో వరి, 75.16 ఎకరాల్లో పత్తి, ఆరెకరాల్లో మక్కకు నష్టం జరిగినట్టు తేల్చారు. సర్వే చేసి నెలలు గడుస్తున్నా సర్కారు మాత్రం పరిహారం అందించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. పరిహారం అందిస్తే తమకు ఎంతో కొంత సాయమయ్యేదని చెబుతున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి పరిహారం అందించాలని వేడుకుంటున్నారు.
పరిహారం ఎప్పుడిస్తరో
నేను వానకాలం మూడు ఎకరాల్లో వేసిన వరి చేతికొచ్చింది. రెండు రోజుల్లో కొద్దామనుకున్న. కానీ, అంతలోనే పంటలను తుఫాను ముంచింది. వరదతో బండారుపల్లి సమీపం కెనాల్‌కు గండి పడి, 50 ఎకరాల్లో పంట కొట్టుకుపోయింది. ఇసుక మేటలు వేసింది. వ్యవసాయ విస్తరణ అధికారులు వచ్చి పంట నష్టం సర్వే చేసిన్రు. ఎకరానికి 10 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తదని చెప్పిన్రు. కానీ, ఇప్పటి వరకు నష్టపోయిన ఏ ఒక్క రైతుకు పరిహారం ఇవ్వలేదు. గండిపడిన కెనాల్‌ను మాత్రం ఏ ఒక అధికారి కూడా పరిశీలించలేదు. సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా స్పందించాలి. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి.
– ప్రతాప్ సుధాకర్, రైతు (రేకొండ)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

