దళిత వ్యతిరేకి ఈటల: ఎమ్మెల్యే రవిశంకర్
ఎమ్మెల్యే రవిశంకర్ | ఈటల రాజేందర్ దళిత వ్యతిరేకి అని సుంకె రవిశంకర్ అన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఈటలకు కర్రు కాల్చి వాతపెడతరని దుయ్యబట్టారు.

కరీంనగర్: ఈటల రాజేందర్ దళిత వ్యతిరేకి అని సుంకె రవిశంకర్ అన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఈటలకు కర్రు కాల్చి వాతపెడతరని దుయ్యబట్టారు. దళితబంధుపై పిచ్చి మాటలు మానుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. హుజూరాబాద్‌కు ఈటెల ఏం చేసిండో చెప్పి ఓట్లడగాలన్నారు. కరీంనగర్లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్ దళితబంధుకు రూపకల్పన చేశారన్నారు. దళిత్ ఎంపవర్మెంట్ కింద సీఎం కేసీఆర్ బడ్జెట్లోనే రూ.1000 కోట్లు ప్రకటించారని గుర్తుచేశారు. దళితబంధు నిధులు ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డాయని చెప్పారు.
పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తెస్తుంటే బీజేపీ సర్కార్ సబ్సిడీలను ఎత్తివేస్తున్నదని, ధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల సంక్షేమం కోసం బీజేపీ ఒక్క పథమైనా తీసుకొచ్చిందా అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన ఆ పార్టీని ప్రజలు తరిమికొడతారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులిస్తే ఖర్చు చేయలేని దద్దమ్మ ఈటల అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

