తిరుపతి మృతిపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి
టీఆర్ఎస్ సీనియర్ నేత బచ్చపల్లి తిరుపతి మృతిపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి మండ లం జిల్లెల్లకు చెందిన తిరుపతి (39) రెండు నెలల క్రితం క్యాన్సర్ బారిన పడి, సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స తీసుకుంటున్నాడు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు
- క్యాన్సర్తో టీఆర్ఎస్ సీనియర్ నేత కన్నుమూత
- అమాత్యుడు తీవ్ర విచారం
- దవాఖానలో మాట్లాడి బిల్ మాఫీ
- మృతదేహం తరలింపునకు అంబులెన్స్ ఏర్పాటు
- స్వగ్రామం జిల్లెల్లలో వీడ్కోలు పలికిన నేతలు
సిరిసిల్ల రూరల్, ఆగస్టు 4: టీఆర్ఎస్ సీనియర్ నేత బచ్చపల్లి తిరుపతి మృతిపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి మండ లం జిల్లెల్లకు చెందిన తిరుపతి (39) రెండు నెలల క్రితం క్యాన్సర్ బారిన పడి, సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స తీసుకుంటున్నాడు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో దవాఖానలోనే తుదిశ్వాస విడువగా, మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే సదరు దవాఖాన యా జమాన్యంతో మాట్లాడి బిల్లు మాఫీ చేయించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చారు. కాగా, అక్క డే ఉన్న జిల్లెల్ల సర్పంచ్ మధు అన్ని ఏర్పాట్లు చేసి జిల్లెల్లకు మృతదేహాన్ని తీసుకువచ్చారు.
కన్నీటి వీడ్కోలు..
బచ్చపల్లి తిరుపతి టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నాడు. నాడు తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నాడు. స్వరాష్ట్రంలో గ్రామ అభివృద్ధితోపాటు పార్టీకి సేవలందిస్తున్నాడు. గురువారం ఉదయం తిరుపతి చనిపోవడంతో పార్టీ నాయకులు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. జిల్లెల్లలో అంత్యక్రియలు నిర్వహించగా, న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ సీనియర్ నేత బొల్లి రాంమోహన్తోపాటు పలువురు నేతలు పాల్గొని నివాళులర్పించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

