Gundaram | గుండారం గ్రామాన్ని సందర్శించిన వైద్య విద్యార్థులు
కమాన్ పూర్ మండలంలోని గుండారం గ్రామంలో సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మూడవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు శనివారం సందర్శించారు.
Gundaram | కమాన్‌పూర్, నవంబర్ 28 : కమాన్ పూర్ మండలంలోని గుండారం గ్రామంలో సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మూడవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు శనివారం సందర్శించారు. రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వ వైద్య కళాశాల-2024 బ్యాచ్ మూడో సంవత్సరం వైద్య విద్యార్థులు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దయాల్ సింగ్ ఆదేశానుసారం కమ్యూనిటీ మెడిసిన్ డిపార్టమెంట్ ఇన్చార్జ్ హెచ్‌వోడీ డాక్టర్ అఖిల్ ఆధ్వర్యంలో కుటుంబ దత్తత కార్యక్రమంలో భాగంగా కమాన్‌పూర్ మండలం నందు గల గుండారం గ్రామాన్ని సందర్శించారు.
గ్రామ సర్పంచ్ జంగిలి పోచాలు, గ్రామ కార్యదర్శి ప్రసాద్ సలహాలు తీసుకొని ఒక్కొక్క వైద్య విద్యార్థి ఐదు కుటుంబాల వివరాలు, ఆరోగ్యసమాచారం సేకరించారు. విద్యార్థులు పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సలహాలు గ్రామ ప్రజలకు వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ సృజన్, ట్యూటర్ డాక్టర్ లత, ఎంఎల్ హెచ్ పీ డాక్టర్ హేమలత, జీఆర్ఎల్ ఎంఎస్ డబ్ల్యూ రవీందర్, ఆరోగ్య భోదకులు టీ నాగరాజు, కారోబార్ భీమయ్య, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

