కేసీఆర్ అంటే నమ్మకం..కాంగ్రెస్ అంటే మోసం
ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన సీఎం కేసీఆర్ పాలన అంటే నమ్మకం..యాభై ఏండ్లు అధికారమిస్తే కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ అంటే మో సం..’అని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ అన్నారు.
- బీఆర్ఎస్ పాలనలోనే అన్నివర్గాలకు న్యాయం
- మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
- కమాన్‌పూర్, పాలకుర్తి మండలాల్లో ముమ్మర ప్రచారం
కమాన్‌పూర్/పాలకుర్తి నవంబర్ 16: ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన సీఎం కేసీఆర్ పాలన అంటే నమ్మకం..యాభై ఏండ్లు అధికారమిస్తే కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ అంటే మో సం..’అని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ అన్నారు. ఎన్నికల ముందర అబద్ధాల గ్యారెంటీలతో ముందుకొస్తున్న హస్తంపార్టీ నాయకులను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కమాన్‌పూర్ మండలంలోని రేపల్లెవాడ, నాగారం, లింగాల, రొంపికుంట, పేరపల్లి, గొల్లపల్లి, పెంచికల్‌పేట, జూలపల్లి, గుండారం, పాలకుర్తి మండలం రాణాపూర్, కన్నాల, భామ్లనాయక్తండా, జీడీనగర్ గ్రామా ల్లో గురువారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. కన్నాల ఎల్లమ్మ గుడి వద్ద గీత కార్మికులను ఓటు అభ్యర్ధించారు. ఆయాగ్రామాల్లో మధూకర్‌కు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులిచ్చి, తిలకందిద్ది ఆశీర్వదించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం కోసం కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. మంథని కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఓటర్లకు గోడగడియారాలు పంచి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. కారు గుర్తుకు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ప్రజలు ఆలోచించాలని అందుబాటులో ఉండే తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కమాన్‌పూర్ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, ఎంపీపీ రాచకొండ లక్ష్మి, వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, జిల్లా నాయకులు ఇనగంటి రామారావు, అధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ గడప క్రిష్ణమూర్తి, బీసీ సెల్ మండల అధ్యక్షులు నడిగొట్టు సంపత్,
మాజీ జడ్పీటీసీ మేకల సంపత్ యాదవ్, ఆయా గ్రామాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇటవేన కొమురమ్మ, గొడిసెల ఉమా, చిందం తిరుపతి, తాటికొండ శంకర్, జాబు సతీష్, బొల్లపెల్లి శంకర్‌గౌడ్, అబ్బిడి వినోద, పోలుదాసరి సాయికుమార్, నాయకులు కొయ్యడ రవి, దీకొండ కొమురయ్య, శ్రీధర్, పోలుదాసరి వినోద్, దండె కిషన్, బాద్రపు మల్లేష్, భూమయ్య, పాలకుర్తిలో జిల్లా నాయకులు పీట్ల గోపాల్, మల్క రామస్వామి, సర్పంచ్ బదావరాజునాయక్, మల్కచంద్రకళ, ఎంపీటీసీ ఎం.ఎ.అతిక్, బండారి మౌనికాకిరణ్, స్రవంతి సదానందం, ఉప సర్పంచ్‌లు పుట్టరంజిత్, కాదాసు శారదాతిరుపతి, కన్నాల ఫ్యాక్స్ వైస్‌చైర్మన్ కురిక్యా సురేశ్, మాజీ ఉపసర్పంచ్ ఉప్పాలదయానంద్, గ్రామశాఖ అధ్యక్షు లు ఖాదర్‌పాషా, లక్ష్మణ్, ఇటిక్యాల శ్రీకాంత్, గండికోట బొబ్బిలి, సాగర్, రాయమల్లు, యూ సుఫ్, ఇసారపు శివ, సంజీవ్‌కుమార్, చంద్పాష, లక్ష్మీనారాయణ, అనిల్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

