Dharmaram | లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.. సీఐటీయూ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్ చెప్పారు.
- డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి
Dharmaram| ధర్మారం, నవంబర్ 27 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్ చెప్పారు. ధర్మారం మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 1, 2, 3 తేదీలలో నిర్వహించనున్న చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి పోస్టర్లను ఆయన శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రవీందర్ హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.42,000 చెల్లించాలని, కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, గ్రామపంచాయతీ తదితర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, ఇతర రంగాల కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారం కోసం కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
డిసెంబర్ 1వ తేదీ ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి పార్లమెంట్ వైపు జరిగే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బోరకుంట మల్లయ్య, గాజుల వెంకటి, గాజుల స్వామి, బొల్లి నర్సయ్య, శ్రీహరి, నాగరాజు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఐలు 12వ నల్లగొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’
కొత్తగూడెం ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్వహణ బాధ్యతలు తాసీల్దార్‌కు అప్పగింత
‘ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా’
Retired Engineer | ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తుంటే తెలంగాణకు తెల్వక పోవడం ఆశ్చర్యకరం : రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆందోళన
Brothers Kill Wives | భార్యల మధ్య గొడవలు భరించలేక.. వారిని హత్య చేసిన సోదరులు
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

