Kathalapur | కథలాపూర్, ఫిబ్రవరి 17 : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల నాయకులు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కేకులు కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం టపాకాయలు పేల్చి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.
కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు మునిగితేలారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, చింతకుంట సర్పంచ్ నాగం భూమయ్య, బీఆర్ఎస్ నాయకులు గడ్డం భూమారెడ్డి, మామిడిపల్లి రవి, మాజీ వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్ రావు, మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బొడ్డు బాలు, సోమ దేవేందర్ రెడ్డి, సంభ నవీన్, బద్దం మహేందర్ రెడ్డి, రమేష్, కల్లెడ శంకర్, నాంపల్లి లిం బాద్రి, గుండారపు గంగాధర్, ఎండి రఫీ, దొప్పాల జలంధర్, రెక్కల సంజీవరెడ్డి, రొక్కం తిరుపతిరెడ్డి, పోకతోట లింబాద్రి, మహిపాల్ రెడ్డి, ముస్కరి కిరణ్, పోతు శేఖర్, జనార్దన్ రెడ్డి, శీలం మోహన్ రెడ్డి, వంగ రవీందర్, చెక్కపల్లి రాజ్ కుమార్, పాలెపు రాజేష్, నల్ల గంగాధర్, బాల్క సంజీవ్, పానుగంటి తిరుజాని, ముంజ దశ గౌడ్, ముజీబ్, మంచాల మహేష్, నస్కురి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.