కార్మికక్షేత్రం జనసంద్రం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిరిసిల్ల నీరాజనం పలికింది. డప్పులు, బోనాలు, మంగళహారతులు పట్టి కార్మిక క్షేత్రం ఘనంగా స్వాగతించింది. జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో గులాబీ దళంలో మరింత జోష్ కనిపించింది.
- కేసీఆర్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్
- అధినేతకు బ్రహ్మరథం
- నేతన్నల ఘన స్వాగతం
కరీంనగర్, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ రాజన్న సిరిసిల్ల (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిరిసిల్ల నీరాజనం పలికింది. డప్పులు, బోనాలు, మంగళహారతులు పట్టి కార్మిక క్షేత్రం ఘనంగా స్వాగతించింది. జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో గులాబీ దళంలో మరింత జోష్ కనిపించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో కరీంనగర్‌లోని కేసీఆర్ భవన్ నుంచి సిరిసిల్లకు బయలు దేరి వెళ్లిన గులాబీ బాస్‌కు దారి పొడవునా ప్రజలు అపూర్వ స్వాగతం తెలిపారు. 6.43 గంటలకు కేసీఆర్ సిరిసిల్ల కొత్త చెరువు వద్దకు చేరుకోగా, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్, వేములవాడ బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం తెలిపారు. అక్కడి నుంచి రోడ్‌షో ప్రారంభమై.. నేతన్న చౌరస్తా వరకు సాగింది.
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, గులాబీ నాయకుల కోలాహలం మధ్య ర్యాలీ సాగింది. కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోకు అపూర్వ స్పందన వచ్చింది. నేతన్న చౌక్ వద్దకు చేరుకున్న అధినేత 7.07 గంటల నుంచి 7.23 గంటల వరకు తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే ‘సీఎం కేసీఆర్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఒక దశలో కేసీఆర్ జోక్యం చేసుకొని.. ప్లీజ్ సైలెంట్‌గా ఉండండి.. అంటూ రిక్వెస్ట్ చేశారు. తదుపరి స్పీచ్ ప్రారంభించిన కేసీఆర్.. కరీంనగర్ పార్లమెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ గెలువాల్సిన అవసరం, ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. బండి సంజయ్‌కీ.. వినోద్‌కుమార్ ఉన్న తేడాను వివరించి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నేతన్నలు పడిన కష్టాలు, బీఆర్ఎస్ పాలనలో దక్కిన భరోసా, మళ్లీ ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో గోసపడుతున్న తీరును వివరించారు. ఈ కష్టాలు పోవాలంటే గులాబీ జెండా ద్వారానే సాధ్యమని ధైర్యం నింపారు. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆగం కావద్దని, ఆలోచించి ఓటు వేయాలని, బీఆర్ఎస్కు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. అబద్ధపు పునాదులపై గద్దెనెక్కిన కాంగ్రెస్‌ను, అలాగే చేనేత పరిశ్రమపై జీఎస్టీ విధించిన బీజేపీని తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.
కాగా, తమ బతుకులకు భరోసానిచ్చి అండగా నిలిచిన కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు నేతన్నలు సాంచాలు బంద్‌పెట్టి తరలివచ్చారు. అశేషంగా తరలివచ్చిన జనంతో నేతన్న చౌక్ జనసంద్రం కాగా, బస్సుపై నుంచి ప్రసంగిస్తున్న కేసీఆర్‌ను చూసేందుకు అభిమానులు బంగ్లాలు, హోర్డింగ్‌లపైకి ఎక్కారు. గులాబీ దళపతి ప్రసంగం ప్రారంభించగానే పటాకులు కాల్చి తమ అభిమానం చాటుకున్నారు. క్రేన్ సహాయంతో అతిపెద్ద గజమాలను వేసేందుకు తీసుకొచ్చారు. కాగా, కేసీఆర్ రోడ్‌షో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. అశేషజనం అధినేతకు నీరాజనం పలుకడం.. ఇదే సమయంలో కేసీఆర్ ప్రసంగం ఆలోచింపజేయడం, ఆయన మాట్లాడినంత సేపు జనంలో వచ్చిన స్పందనను చూసి నయా జోష్ కనిపించింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

