Road Accident | కథలాపూర్, జూన్ 27 : రోడ్డు ప్రమాదంలో కథలాపూర్ తహసీల్దార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కథలాపూర్ మండలం పోసానిపేట శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. కథలాపూర్ తహసీల్దార్ రమేష్ విధులకు హాజరయ్యేందుకు కరీంనగర్ నుండి కథలాపూర్‌కు కారులో వస్తున్న క్రమంలో పోసానిపేట శివారులో మూలమలుపు వద్ద ఓ చెట్టును ఢీకొట్టింది.
ఈఘటనలో తహసీల్దార్ రమేష్ చేయు విరిగినట్లు స్థానికులు తెలిపారు. తహసీల్దార్ ప్రయాణిస్తున్న కారు అతడే సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు. పోసానిపేట శివారులో ప్రమాదకరమైన మూలమలుపు ఉండటంవల్ల తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకరమైన మూలమలుపు వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానిక కోరుతున్నారు.