తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 23: అంబేద్కర్‌ను దళిత యువత ఆదర్శంగా తీసుకొని అంచెలంచెలుగా ఎదగాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆకాంక్షించారు. మండలంలోని పొరండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం ఆయన సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం ఎంతగానో తపిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాను నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 56 అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేశానని, ఇది 57వ విగ్రహం అని చెప్పారు.
విగ్రహ దాత ఆరెపల్లి మోహన్‌తో పాటు ఇందుకు సహకరించిన గ్రామ నాయకులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాటలు పాడుతూ.. మ్యూజిక్ వాయిస్తూ సందడి చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. సర్పంచ్ రెడ్డి త్రివేణి-తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ రజిత-లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ ఎలుక అనిత, ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, గ్రామాధ్యక్షుడు అసోద శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు మేడి అంజయ్య, బోయిని కొమురయ్య, జలపతి పాల్గొన్నారు.