Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 20 : చిగురుమామిడి మండల తహసీల్దార్‌గా కొండం కనకయ్య శనివారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గన్నేరవరం మండలం నుండి బదిలీపై చిగురుమామిడికి వచ్చారు.
బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌ను డిప్యూటీ తహసీల్దార్ కళావతి రెవెన్యూ సిబ్బంది శాలువాతో సత్కరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలు వివిధ సమస్యలపై వచ్చేవారు రెవెన్యూ సిబ్బందిని లేదా తనను నేరుగా సంప్రదించారని కోరారు.