Vemulawada | వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ‘జిల్లేడు చెట్టు’ షూటింగ్.. పేషెంట్లకు ఇబ్బందులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సినిమా షూటింగ్ నిర్వహించడం పేషెంట్లకు ఇబ్బందికరంగా మారింది.
- ప్రమాదంలో గాయపడిన పేషెంట్‌కు ఎమర్జెన్సీ దారి నిరాకరణ
- కుటుంబ సభ్యులతో షూటింగ్ మేనేజర్ వాగ్వాదం
Vemulawada | వేములవాడ, నవంబర్ 26 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సినిమా షూటింగ్ నిర్వహించడం పేషెంట్లకు ఇబ్బందికరంగా మారింది. ఆసుపత్రి ప్రాంగణంలో ‘జిల్లేడు చెట్టు’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదంలో గాయపడిన ఓ పేషెంట్‌ను అత్యవసర మార్గం ద్వారా తీసుకెళ్లకుండా, పక్కదారి నుంచి వెళ్లాలని షూటింగ్ మేనేజర్ సూచించినట్లు పేషెంట్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ మార్గం విషయంలో పేషెంట్ ఎదురుగట్ల లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు షూటింగ్ మేనేజర్‌కు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
ప్రభుత్వ ఆసుపత్రిలో షూటింగ్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చే సమయంలో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రిలో షూటింగ్ కారణంగా అత్యవసర సేవలకు ఆటంకం కలగడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో షూటింగ్‌కు అనుమతులు ఇచ్చి, పేషెంట్లకు ఇబ్బందులు కలిగించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.
రోగులు ప్రాణాలు తో పోట్లాడుతూ అనేక బాధలు, ఇబ్బందుల తో ఆసుపత్రికి వస్తె వినోదాల కోసం వారిని ఇబ్బంది పెట్టడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేషెంట్లకు ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఈ 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్’
Pakistani Drama | బెంగళూరులో పాక్ డ్రామాకు బ్రేక్.. సోషల్ మీడియా వ్యతిరేకతతో రెండు షోలు రద్దు!
Biker | బైకర్‌ను ఢీకొట్టిన కార్లు.. ఏం జరిగిందో చూడండి.. వీడియో
Hotel Demolish Attempt | ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు హోటల్ తొలగింపునకు యత్నం.. బాధితుడు ఆందోళన
Professor D Rajireddy | అగ్రోమెటియరాలజీలో ప్రొఫెసర్ డి. రాజిరెడ్డికి గౌరవ ఫెలోషిప్ ప్రదానం
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

