RTC Driver | పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగిత్యాలలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేస్తుండగా అదే మార్గంలో వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి తర్వాత ఆందోళన చేయొచ్చు కానీ.. ముందు వడ్లు, మక్కలు కొనట్లేదు.. ముందు వాటి గురించి పట్టించుకోండి.. అంటూ సూచించిన విషయం తెలిసిందే.
అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవడంతో డ్రైవర్ అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కించపరుస్తూ మాట్లాడాడని జగిత్యాల మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ ఆర్టీసీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫిర్యాదు ఆధారంగా జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. ముందు వడ్లు కొనండి అని చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను విధుల నుండి తొలగిస్తూ జగిత్యాల ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రిమూవల్ లెటర్ జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల కంప్లైంట్ ఆధారంగా జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం తొలగింపు
ముందు వడ్లు కొనండి అని చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను విధుల నుండి తొలగిస్తూ రిమూవల్ లెటర్ జారీ చేసిన జగిత్యాల ఆర్టీసీ రీజినల్ మేనేజర్
అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కించపరుస్తూ… https://t.co/9aF2B7qrCc pic.twitter.com/RKzQSZiNbT
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026