Chigurumamidi | ఆమె కండ్లు సజీవం.. అవయవదానంతో మరో ఇద్దరికి చూపు
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన దుద్దెల శ్రీనివాస్ (హెడ్ కానిస్టేబుల్ కూతురు దుడ్డేల తేజస్విని (32) తో పాటు ఆమె సోదరి ద్విచక్ర వాహనంపై కొత్తపెళ్లి నుండి కరీంనగర్ కు వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనానికి ఢీకొనడంతో కాలుకు తీవ్రం గాయమైంది.
Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 6 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన దుద్దెల శ్రీనివాస్ (హెడ్ కానిస్టేబుల్ కూతురు దుడ్డేల తేజస్విని (32) తో పాటు ఆమె సోదరి ద్విచక్ర వాహనంపై కొత్తపెళ్లి నుండి కరీంనగర్ కు వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనానికి ఢీకొనడంతో కాలుకు తీవ్రం గాయమైంది. కాగా, కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. తేజస్విని వరంగల్‌లోని ఎన్ఐఎఫ్లో పీహెచ్డీ స్కాలర్‌గా చదువుకుంటూ, మరోవైపు సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతోంది. ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె అకాల మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులను తీవ్ర విషాదంలో ముంచింది. అయితే విషాద సమయంలోనూ ఆమె కుటుంబ సభ్యులు తేజస్విని నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు హైదరాబాద్ వారికి దానం చేశారు.
ఆమె మరణించినా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపేలా చేశారు. ఆమె కండ్లు మరో ఇద్దరికి చూపునివ్వనున్నాయి. తేజస్విని భౌతికంగా దూరమైనా నేత్రదానం ద్వారా సజీవంగా నిలిచిపోనుంది. తేజస్విని మృతి పట్ల సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీష్, సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్సైలు మామిడాల సురేందర్, చందవేని శ్రీనివాస్, సర్పంచ్ అల్లెపు సంపత్, మాజీ సర్పంచ్ పిట్టల రజిత, సీపీఐ జిల్లా నాయకులు చాడ శ్రీధర్ రెడ్డి, బోయిని అశోక్ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Illegal Arrest | బీఆర్ఎస్ నాయకుడు బాలరాజు యాదవ్ అక్రమ అరెస్ట్
OPPO Smart Phone | ఒప్పో నుంచి బ్యాటరీ బాంబ్.. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్!
Supreme Court: 3 రాష్ట్రాల మధ్య 60 ఏళ్లుగా విద్యుత్తు వివాదం.. పరిష్కరించిన సుప్రీంకోర్టు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

