KCR | హైదరాబాద్ సిటీలో మనోళ్లకు పోలీస్ ఉద్యోగం, సెప్రాసి ఉద్యోగం కూడా దొరకదని తెలిసి అప్పుడు నాకు తిక్కరేగింది. నేను బతకుండగానే చావో రేవో తేల్చుకోవాలని ఆ రోజే మేము శపథం కట్టినం. సిద్దిపేటలో ఉద్యోగ గర్జన చేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో యాందాకైనా మంచిదే దేక్లేంగే అని చెప్పి ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు వెళ్లినమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరితే తెలంగాణ మొత్తం అల్లకల్లోలమైంది. మీరు కూడా ఎక్కడోళ్లు అక్కడ వంద గ్రామాల్లో టెంట్లు, లొల్లులు..పార్లమెంట్లో అల్లకల్లోలం. ప్రజలంతా గందరగోళం చేస్తే అప్పుడు కేంద్రమంత్రి చిదంబరం ఒక ప్రకటన ఇచ్చిర్రు.. తెలంగాణ ఏర్పాటు చేస్తం నువ్వు దీక్ష బంద్ చేయాలని మాటిస్తే నమ్మి దీక్ష బంద్ చేసినం. తెల్లారి ఆంధ్రోళ్లు రాజీనామాల డ్రామా. మూడో రోజుకే మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. మళ్లీ అన్ని పార్టీలతో జేఏసీ పెట్టి మళ్లీ మూడున్నరేండ్లు భయంకరంగా కొట్లాడితే మీరందరూ ఎక్కడోళ్లడక్కడ ఆశీర్వదిస్తే తెలంగాణ వచ్చిందన్నారు.
Valmiki Ramayana | ఆధ్యాత్మిక కలయిక.. ‘వాల్మీకి రామాయణం’ కోసం జతకట్టిన ఇళయరాజా!
Mahavatar Parshuraam | ధర్మ రక్షణ కోసం పరశురాముడి ఆగమనం.. ‘మహావతార్ పరశురామ్’ మోషన్ పోస్టర్ రిలీజ్