కార్పొరేషన్/తెలంగాణచౌక్/కమాన్‌చౌరస్తా/గంగాధర/విద్యానగర్/వీణవంక/చిగురుమామిడి/మానకొండూర్రూరల్, మార్చి 7: జిల్లా వ్యాప్తంగా గురువారం ముందస్తుగా మహిళా దినోత్సవం నిర్వహించారు. కాగా, నగరంలోని ఎస్సారార్ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో లావెండర్ బ్యూటీ జోన్ వ్యవస్థాపకురాలు ఉమారాణి, శివసాయి హోమ్ ఫుడ్స్ వ్యవస్థా పకురాలు సుజాత రెడ్డి, చింటూ ప్రింట్స్ వ్యవస్థాపకురాలు భద్రవతి, కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం కోఆర్డినేటర్ ఉమా మహేశ్వరి, కళాశాల ఈడీసీ కోఆర్డినేటర్ డాక్టర్ సతీశ్‌కుమార్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాజయ్య పాల్గొన్నారు. అనంతరం ఎల్ఐసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సంస్థ డెవలప్మెంట్ అధికారి చక్రపాణి బహుమ తులు ప్రదానం చేశారు.
డాక్టర్ మల్లా రెడ్డి, డాక్టర్ శోభారాణి, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ శారద, శిరీష తదితరులు పాల్గొన్నారు. స్థానిక అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన వేడుకలకు కరస్పాండెంట్ రవీందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అక్షయ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ విజయలక్ష్మి, చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొ న్నారు. ముకరంపురలోని వాగేశ్వరి ఉమెన్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ గోపాల్, ప్రిన్సిపాల్ డాక్టర్ పీ వెంకట్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రమణ, ఏవో వేదవ్యాస్, లింగారావు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
కరీంనగర్‌లోని బృందావన్ గార్డెన్లో కార్పొరేటర్ ఆకుల నర్మద-నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సఖీ కేంద్రం ఇన్చార్జి లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, ఆర్పీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, సీవో తిరుపతి, ఆర్పీలు మంజుల, లత, అరుణ, విజయ పాల్గొన్నారు. సప్తగిరికాలనీలోని రామాలయ ఆవరణలో శ్రీసప్తగిరి లయన్స్ ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో క్లబ్ అధ్యక్షురాలు పన్యాల సుజాత, సభ్యులు సత్యవతి, విమల, నిరంజనీ దేవి, సుజాత, అంగన్వాడీ సూపర్ వైజర్లు విజయ, స్వప్న, టీచర్లు ఉషారాణి, హరి ప్రియ, పన్యాల వెంకటరెడ్డి, కోటేశ్ కుమార్, రామచందర్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే, నగరంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి, నాయకులు అన్నపూర్ణ, జరీనా, లక్ష్మి, స్వప్న, సీఐటీయూ, డీవైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.
వీణవంకలో టీసెర్ప్ ఐకేపీ జీవనజ్యోతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవానికి ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. డీఆర్డీఏ డీపీఎం రమణ, ఏపీఎం కొమురయ్య, సీసీలు ఆనంద్, ఘణశ్యామ్, తిరుపతి, శ్రీకాంత్, స్త్రీనిధి మేనేజర్ అనిల్, వీవో ప్రెసిడెంట్లు, మండల సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు. గంగాధర మండలం గర్శకుర్తి సరస్వతీ విద్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీటీసీ తడిగొప్పుల రజిత, కరస్పాండెంట్ రాజశేఖర్, ప్రిన్సిపాల్ మాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిగురుమామిడి రైతు వేదికలో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఆకవరం భవాని, ఎంపీడీవో మధుసూదన్, సూపరిం టెండెంట్ ఖాజా మొహినొద్దీన్, ఎంపీవో శ్రవణ్‌కుమార్, కేడీసీసీ ఏజీఎం జమున, బ్యాంకు మేనేజర్ అనిత పాల్గొన్నారు. మానకొండూర్ మండలం ఊటూర్ జడ్పీహెచ్ ఎస్‌లో నిర్వహించిన వేడుకల్లో హెచ్ఎం స్వరూపారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.