Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 29 : చిగురుమామిడి మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న ఎరువుల దుకాణాలలో తనిఖీలు మంగళవారం రెండో రోజు కొనసాగాయి. వ్యవసాయ సంచాలకులు నరేండ్ల శ్రీధర్ పలు గ్రామాల్లో దుకాణాలను తనిఖీలు నిర్వహించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు మాత్రమే అందేలా చూడాలని సూచించారు.
ప్రభుత్వ అనుమతి లేని నకిలీ ఎరువులు విత్తనాలను విక్రయించడానికి ప్రభుత్వం పూర్తిగా నియంత్రించిందని, ఎవరైనా అలాంటి అమ్మకాలు చేపడితే వారిపై చర్యలు తీసుకోవడం తీసుకోనున్నట్లు దుకాదారులను హెచ్చరించారు. ఈ తనిఖీలల్లో ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్, ఏఈవోలు ఉన్నారు.