జగిత్యాల జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఐఎంఏ ముందడుగు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జూన్ 26, 2026న నిర్వహించనున్న ‘యాంటీ డ్రగ్ 3కే రన్’ కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు.
జగిత్యాల : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జూన్ 26, 2026న నిర్వహించనున్న ‘యాంటీ డ్రగ్ 3కే రన్’ కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతను లక్ష్యంగా చేసుకుని సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల వ్యసనం దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ దుర్వినియోగంపై ప్రజలు, ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు ఐఎంఏ జగిత్యాల చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. సమాజంలో ఆరోగ్యకరమైన జీవన విధానాలను ప్రోత్సహించేందుకు వైద్యులు ముందుకు రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత, వైద్యులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాన్ని సమాజానికి చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ‘రన్ స్ట్రాంగ్–లివ్ ఫ్రీ, సే నో టు డ్రగ్స్’ అనే నినాదంతో నిర్వహించనున్న ఈ 3కే రన్ పాత బస్టాండ్ దగ్గర లోని శ్రీ వివేకానంద మినీ స్టేడియం నుండి ఐఎంఏ భవన్ వరకు జరగునున్నట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ అవగాహన పరుగు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు సమాజంలోని ప్రతీ ఒక్కరూ బాధ్యత వహించాలని, యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్ కోసం డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సంకల్పిద్దామని పిలుపునిచ్చారు. ఈ యాంటీ డ్రగ్ 3కే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జగిత్యాల కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి, కోశాధికారి డాక్టర్ కోటగిరి సుధీర్ కుమార్, డాక్టర్ వడ్లూరి శ్రవణ్ కుమార్, డాక్టర్ బండెల విజయ్, డాక్టర్ ఇనుగురతి రాజశేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

