పంట నష్టాన్ని అంచనా వేయాలి
వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించి, నష్టాన్ని అంచనా వేసి నివేదికలు తయారు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. కొత్తపల్లి పట్టణంతో పాటు మండలంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను బుధవారం ఆమె పరిశీలించారు. ఎలగందుల గ్రామంలో రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
- అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
- కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో దెబ్బతిన్న పంటల పరిశీలన
కొత్తపల్లి, ఏప్రిల్ 26: వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించి, నష్టాన్ని అంచనా వేసి నివేదికలు తయారు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. కొత్తపల్లి పట్టణంతో పాటు మండలంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను బుధవారం ఆమె పరిశీలించారు. ఎలగందుల గ్రామంలో రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. 2023-24 సంవత్సరానికి మండలంలోని చింతకుంట, ఎలగందుల గ్రామాల్లో ప్లాంటేషన్ కోసం గుర్తించిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎలగందుల నర్సరీ (ఈతవనం)ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, డీఆర్డీవో శ్రీలత, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, తహసీల్దార్ నల్ల వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి రంజిత్, రైతు బంధు సమితి సభ్యుడు వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించాలి
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 26: జిల్లాలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ రూరల్ మండలం చెర్లభూత్కూర్, తాహెర్ కొండాపూర్ గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆమె పరిశీలించారు. గ్రామాల వారీగా పంట నష్టం వివరాలు సేకరించారు. రైతులు అధైర్యపడొద్దని, పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. గ్రామాల్లో ధ్యానం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చెర్లభూత్కూర్ గ్రామంలో నర్సరీని పరిశీలించారు. గ్రామంలో హోం ప్లాంటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ఎస్సారెస్పీ కాలువల గట్లపై మొక్కలు నాటాలని సూచించారు. నగునూర్, చామనపల్లి, చెర్లభూత్కూర్, ఇరుకుల్ల, దుర్శేడ్, మొగ్దుంపూర్ గ్రామాల్లో కాల్వల గట్ల వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. చెర్లభూత్కూర్‌లోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న కాల్వపై కిలో మీటరు పొడవున మొక్కలు నాటించేందుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లా జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, డీఆర్డీవో శ్రీలత, మండల ప్రత్యేకాధికారి మధుసూదన్, మండల వ్యవసాయాధికారి సత్యం, ఉద్యానవన శాఖ డీఈ శ్రీనివాస్, ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి, సర్పంచులు దబ్బెట రమణారెడ్డి, మడికంటి మమత, ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, కూర శ్యాంసుందర్‌రెడ్డి, మడికంటి మారుతి, ఏపీవో శోభ, పద్మ, దాసరి మల్లారెడ్డి, గోస్కుల శంకరయ్య, రాజు, లక్ష్మణ్, శంకర్, ప్రశాంత్, రాజయ్య, వెంకన్న, ఏఈవో అనూజ్ఞ, ఏపివో శోభ, టెక్నిషియన్ పద్మ, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

