పక్కా భవనాలకు మోక్షమెప్పుడో?
సర్కారు కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఆద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరిన పాఠశాలల్లో..రేకుల షెడ్లలో సరైన సదుపాయాలు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు.
- అద్దె భవనాల్లోనే సర్కారు కార్యాలయాలు
- అరకొర సదుపాయాలతో ప్రజల అవస్థలు
- సిబ్బందికి తప్పని ఇబ్బందులు
రాయపోల్, జూలై 13 : సర్కారు కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఆద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరిన పాఠశాలల్లో..రేకుల షెడ్లలో సరైన సదుపాయాలు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. వర్షాకాలం,వేసవి వస్తే బాధలు వర్ణనాతీతంగా ఉన్నా యి. కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు అందని ద్రాక్షలానే మిగిలిపోతోంది. ఐదు దశాబ్దాలుగా రాయపోల్ మండలం ఏర్పాటుకు కోసం ప్రజలు పోరాటం చేస్తే 2017 అక్టోబర్ 12న కల సాకారమైంది. దౌల్తాబాద్ మండలం నుంచి విడిపోయి 13 గ్రామ పంచాయతీలతో కొత్త మండలంగా ఏర్పడింది. 2019లో కొత్త గ్రామపంచాయతీల పునర్విభజన జరిగింది. తర్వాత మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. మండలంలోని శాంతిభద్రతలు పరిరక్షించే పోలీస్ స్టేషన్ సైతం ఓ ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్నది. నాలుగు గదుల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు సిబ్బందికి తిప్పలు తప్పడం లేదు.
కనీసం లాకఫ్ ఏర్పాటు చేసుకోలేకపోడంతోపాటు వివిధ వస్తువులు, రికార్డులు భద్రపర్చేందుకు సరైన గదులు లేక పోలీసు సిబ్బందికి ఇబ్బందిగా మారింది. సెర్ప్ కార్యాలయం కూడా వదిలేసిన పాఠశాల భవనంలోనే కొనసాగుతున్నది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసం ఒకేచోట ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నా ప్రభుత్వ అధికారులు ఆదిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మండల తహసీల్ కార్యాలయం శిథిలావస్థకు చేరిన పాఠశాలలో, ఎంపీడీవో కార్యాలయానికి కూడా సొంత భవనం లేక రేకులషెడ్లో కొనసాగుతున్నది. కనీస వసతులు లేక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న మండలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చూసింది. ఇందులో భాగంగానే రాయపోల్ మండలం ఏర్పడినప్పటికీ ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు లేక సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

