Art festivals | కోల్ సిటీ, మే 10: ఈనెల 17న గోదావరిఖనిలో నిర్వహిస్తున్న కళోత్సవాలకు కళాభిమానులు తరలిరావాలని గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య పిలుపునిచ్చారు. ఈమేరకు గోదావరిఖనిలోని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో గల స్పూర్తి భవన్ లో కళా సంఘాల సభ్యులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళోత్సవాలకు సంబంధించి వాల్ పోస్టర్ అవిష్కరించారు.
ఈనెల 17న స్థానిక ఆర్ సీ ఓ ఏ క్లబ్ లో అంగరంగ వైభవంగా కళోత్సవాలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అధికారులు, కళాకారులు, ప్రముఖులు, రామగుండం శాసన సభ్యులు అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. కళా సంఘాల సమాఖ్య 37వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జరిగే ఈ వేడుకల్లో కళాకారులు వివిధ కళారూపాలు ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా ఉన్న కార్మిక క్షేత్రం వైభవం చాటేలా 17న కళోత్సవాలు మరింత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు బొంకూరి మధు, రేణిగుంట రాజమౌళి, రాశిపాక రాజమౌళి, మేదరి వాసు, వెంకటరాజం. సోగాల వెంకటి, అంజయ్య, లక్ష్మణ్, దేవేందర్, నాగుల శ్రీనివాస్, మొండయ్య, నాగరాజు, సురేశ్, సందీప్, గీత. లలిత తదితరులు పాల్గొన్నారు.