Bonala Jatara | జూలై 16న మంథనిలో గంగమ్మ తల్లి బోనాల జాతర
గంగపుత్రుల కుల దైవం, సర్వ మానవాళి ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాన్ని జూలై 16న నిర్వహించనున్నట్లు బోనాల కమిటీ అధ్యక్షుడు గంధం వెంకటస్వామి తెలిపారు.
- ఆరుగురితో నిర్వహణ కమిటీ ఎన్నిక
Bonala Jatara | మంథని, జూన్ 19 : గంగపుత్రుల కుల దైవం, సర్వ మానవాళి ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాన్ని జూలై 16న నిర్వహించనున్నట్లు బోనాల కమిటీ అధ్యక్షుడు గంధం వెంకటస్వామి తెలిపారు. మంథని గంగపుత్ర సంఘం అధ్యక్షుడు అంకరి కుమార్ అధ్యక్షతన గురువారం బోనాల కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ నూతన అధ్యక్షుడిగా గంధం వెంకటస్వామి, ఉపాధ్యక్షుడిగా మోసం శంకర్, ప్రధాన కార్యదర్శిగా అంబటి కుమార్, సహాయ కార్యదర్శిగా అంబటి సతీష్, కోశాధికారిగా అంకరి ప్రకాష్, కార్యనిర్వాన కార్యదర్శిగా అంకరి శివ మురళి లను ఎన్నుకున్నారు.
మంథని నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించి త్వరలోనే నియోజకవర్గంలోని గంగపుత్ర సంఘాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. సన్నాహక సమావేశానికి త్వరలోనే తేదీలను ప్రకటించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ బోనాల జాతర కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఉన్న గంగపుత్రులు ఈ గంగమ్మ తల్లి మహా జాతర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో అంబటి సాయిలు, అంకరి లింగయ్య, మోసం నరసయ్య, అటికేటి కోటేష్, బోయిని నారాయణ, జీదుల రాజేందర్, అంబటి గట్టయ్య, అంబటి సాయి, మర్రి రఘు, అంబటి నరేష్, సౌళ్ల స్వామి, అటికేటి శ్రావణ్, అటికేటి సాగర్, రానవేన చేతన్, రాబర్ట్ విల్సన్, అంబటి సాయికిరణ్ లు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

