ప్రత్యేక ప్రణాళికతోనే ఉత్తమ ఫలితాలు
ప్రత్యేక ప్రణాళిక, నిష్ణాతులైన అధ్యాపకుల బోధనతోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని ట్రినిటీ విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. నీట్, జేఈఈ, ఎంసెట్‌లో తమ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. నీట్లో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరీంనగర్ వావిలాలపల్లిలోని ప్రైం క్యాంపస్‌లో అభినందించారు.
- ట్రినిటీ ఫౌండర్ దాసరి మనోహర్‌రెడ్డి
కమాన్‌చౌరస్తా, జూన్ 6: ప్రత్యేక ప్రణాళిక, నిష్ణాతులైన అధ్యాపకుల బోధనతోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని ట్రినిటీ విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. నీట్, జేఈఈ, ఎంసెట్‌లో తమ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. నీట్లో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరీంనగర్ వావిలాలపల్లిలోని ప్రైం క్యాంపస్‌లో అభినందించారు. అనంతరం మాట్లాడుతూ ట్రినిటీ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని వివరించారు.
సాధారణ విద్యార్థులతో పటిష్టమైన ప్రణాళిక, ఒత్తిడి లేని విద్యావిధానంతో ఈ ర్యాంకులు సాధించడం గొప్పగా భావిస్తున్నామని చెప్పారు. కళాశాలకు చెందిన ముసాబ్ హుస్సేన్ (685), నిఖిల్ (681), సయ్యద్ ముజకిర్ అలీ (676), శశాంక్ (671), ఆదిత్య (670), కరణ్ సింగ్ (667), సందీప్ కుమార్ (665), అజిత్ కుమార్ (657), వివేక్ సిద్ధార్థ్ (655) మారులు, మాళవిక (651), ముజమ్మిల్ ఖాన్ (633), స్పూర్తి 599తో పాటు పలువురు 450పై మారులు సాధించారని చెప్పారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

