Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 21 : సీనియర్ జర్నలిస్టు రాంప్రసాద్ పై దుర్బాషలాడిన బెదిరింపులకు పాల్పడిన మాజీ ఎంపీపీ నల్ల రాజన్న బేషరతుగా వెంటను క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తోట శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో కార్యకర్తలతో కలిసి సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్న పదేండ్ల పాటు జర్నలిస్టుల సలహాలతో కుటుంబ సభ్యుల మాదిరిగా మండలాభివృద్ధికి సమిష్టిగా కృషి చేశామాని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారం అడ్డం పెట్టుకోని కొందరు నాయకులు మండలంలోని అధికారులు, జర్నలిస్టులపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే, పార్టీ పదాధికారులు, సర్పంచులు, కార్యకర్తలందరు సమానమేనని, కానీ కాంగ్రెస్ కార్యాలయంలో పదవీ ఒకరిది, కూర్చీ మరోకరిగా ఉండటమే అధికార అహంకు నిదర్శనమన్నారు. మాజీ ఎంపీపీ గతంలో సైతం జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడ్డారని, వెంటనే ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరారు. జర్నలిస్టులకు ఎల్లవేళాల బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కదుర్క నర్సయ్య, వైస్ చైర్మన్ ముద్దం శరత్, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, నాయకులు మ్యాకల సతీష్, తీట్ల రాజేష్, భూక్య గోవిందయక్, తదితరులు పాల్గొన్నారు.