MLA Vijayaramana Rao | మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలి.. ఎమ్మెల్యే విజయరమణారావు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని విజయ రమణారావు పేర్కొన్నారు.
MLA Vijayaramana Rao | కాల్వ శ్రీరాంపూర్, అక్టోబర్ 23 : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని విజయ రమణారావు పేర్కొన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మార్కెట్ యార్డులో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆదనపు కలెక్టర్ దాసరి వేణు తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారుల నమ్మి మోసపోకుండా పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. మరో వారం రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని, రైతులు ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు. అనంతరం పంటలకు సంబంధించిన మద్దతు ధర పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జేసీ వేణు, మార్కెట్ డీఎం ప్రవీణ్ కుమార్, మార్క్ఫెడ్ ఎగ్జిక్యూటీవ్ మునవర్, కార్యదర్శి ప్రేమ్ కుమార్, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, తహసీల్దార్ జగదీశ్వరరావు, డీటీ శంకర్, విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కాల్వ శ్రీరాంపూర్ ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి తల్లి రామిడి రాధమ్మ మీర్జంపేటలో ఇటీవల మృతిచెందగా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

