Mallapur | మల్లాపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం
మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో మల్లాపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరంను నిర్వహించారు.
Mallapur | మల్లాపూర్, మార్చి 24 : మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో మల్లాపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేవేల్లి తిరుపతి మాట్లాడుతూ గ్రామాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యుల సమిష్టి సహకారంతో విస్తృతంగా ప్రజలకు సేవలను అందిస్తామాని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ శిబిరంలో 150 మంది రోగులకు వైద్య పరీక్షలను నిర్వహించి 50 మంది రోగులను శస్త్ర చికిత్స నిమిత్తం రేకుర్తి కంటి దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అనిల్, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, కోశాధికారి మిల్క నవీన్, సీనియర్ సభ్యులు సభ్యులు ముద్ధం రాజేంద్రప్రసాద్ గౌడ్, వెల్మల శ్రీనివాసరావు, పోలీస్ శ్రీనివాస్, సభ్యులు రంగు రామాగౌడ్, లక్పతిరెడ్డి, ప్రవీణ్, నాగేష్ రెడ్డి, స్వామి, లక్పతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

