Lions Club | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిరిపూర్లో కంటి వైద్య శిబిరం
మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
Lions Club | మల్లాపూర్, జూలై 14 : మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేవేల్లి తిరుపతి మాట్లాడుతూ గ్రామాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, లయన్ల క్లబ్ సభ్యుల సమిష్టి సహకారంతో విస్తృతంగా ప్రజలకు సేవలను అందిస్తామని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ శిబిరంలో 140 మంది రోగులకు వైద్య పరీక్షలను నిర్వహించి 50 మంది రోగులను శస్త్ర చికిత్స నిమిత్తం రేకుర్తి కంటి దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ పాలకవర్గం సభ్యులను రాష్ట్ర వెలమ కార్పోరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంట సౌజన్య, కార్యదర్శి మండ స్వామి, కొశాధికారి కల్లెం నాగిరెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎలాల జలపతిరెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల బాపురెడ్డి, మెట్పల్లి క్లబ్ అధ్యక్షుడు వెల్మల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్ల సోమయ్య, లయన్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

