Interview | సీఎం కేసీఆర్ పేరే నా విజయరథం.. ప్రజలే నా బలం బలగం: డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
Interview | ‘వైద్యవృత్తిలో కంటే రాజకీయాల్లోనే ప్రజాసేవ చేయడానికి విస్తృతి ఎక్కువ. అందుకే నేరుగా నా కోరుట్ల బలగానికి సేవ చేయాలన్న ఆశయంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చా. ఇప్పుడు నిలిపిన దార్శనికుడు, రాజనీతిజ్ఞుడైన సీఎం కేసీఆర్ నా పేరును ప్రకటించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నెలబట్టుకుంటా’ అని కోరుట్ల అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు.
Interview | ‘కోరుట్ల నియోజకవర్గ ప్రజలే నా బలం. నా బలగం. ఇరవై ఏళ్లుగా వైద్య పరంగా సేవలందిస్తూ.. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ.. శస్త్ర చికిత్సలు చేయిస్తూ ఈ ప్రాంత ప్రజలతో ఉన్నా. స్వచ్ఛంద సంస్థలతో పాఠశాల భవనాలు నిర్మించిన. అయితే ప్రజా సేవకు వైద్యవృత్తిలో కంటే రాజకీయాల్లోనే విస్తృతి ఎక్కువ. ప్రజాసేవ అంటే బాధ్యత. అందుకే నేరుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చా. అధినేత కేసీఆర్ నాకు బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం నా అదృష్టం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా’ అని కోరుట్ల అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్య్యూ ఇచ్చారు. కేసీఆరే తన తారకమంత్రమని, అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన గెలుపునకు దోహదం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
జగిత్యాల, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ‘వైద్యవృత్తిలో కంటే రాజకీయాల్లోనే ప్రజాసేవ చేయడానికి విస్తృతి ఎక్కువ. అందుకే నేరుగా నా కోరుట్ల బలగానికి సేవ చేయాలన్న ఆశయంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చా. ఇప్పుడు నిలిపిన దార్శనికుడు, రాజనీతిజ్ఞుడైన సీఎం కేసీఆర్ నా పేరును ప్రకటించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నెలబట్టుకుంటా’ అని కోరుట్ల అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్య్యూ ఇచ్చారు. ప్రజలే తన బలం, బలగమని, కేసీఆర్ పేరే విజయరథం అని, అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన గెలుపునకు దోహదపడుతాయని ధీమా వ్యక్తం చేశారు. వందేళ్లలో జరుగని అభివృద్ధి తెలంగాణ వచ్చిన పదేళ్లలో జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు హయాంలో కోరుట్ల నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. అధినేత తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను వందశాతం నెరవేర్చి, నియోజకవర్గాన్ని ఆదర్శంగా మారుస్తానని స్పష్టం చేశారు.
నమస్తే : కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా చేశారు. అయితే ఆఫీసులు ఎప్పుడు ఏర్పాటవుతాయి?
సంజయ్ : పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మొదట మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. తర్వాత కోరుట్లను చేశారు. అయితే కోరుట్లలోని పెద్దగుండు వద్ద అన్ని రెవెన్యూ కార్యాలయాలు ఒకే చోట నిర్మించాలన్నది ఆలోచన. సమీకృత కలెక్టరేట్ ఎలాగైతే ఉంటుందో అలాగే కట్టాలని భావించారు. గతంలో ఉన్న నాయకులు తహసీల్ ఆఫీస్‌ను కోరుట్లకు దూరంగా కట్టారు. పనికోసం అక్కడికి వెళ్లాలంటే 150 రూపాయల ఆటో కిరాయి కట్టాలి. మళ్లీ మన ప్రభుత్వం వచ్చాక దాన్ని పట్టణంలోకి మార్చాం. ఊరికి దూరంగా, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉండవద్దన్న ఉద్దేశంతో అన్ని అందుబాటులో ఉండేలా కట్టే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే కోరుట్లలో ఆర్డీవో, పంచాయతీ, పోలీస్, ఎక్సైజ్ డివిజన్‌కు సంబంధించిన అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేస్తాం.
నమస్తే : మీ గెలుపుపై ఏం అనుకుంటున్నారు?
సంజయ్ : వందశాతం విజయం సాధిస్తా. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యాక్రమాలే నా విజయ సోపానాలు. కేసీఆర్ నామమే నా విజయధ్వజం. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, బీసీ కులాలకు ఆర్థిక సాయం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, చేరువైన వైద్యం, మున్సిపాలిటీల అభివృద్ధి ఇవన్నీ నన్ను గెలిపించే ‘తారక’ మంత్రాలే.
నమస్తే : ఎప్పటినుంచి ప్రజా సేవలో ఉన్నారు..?
సంజయ్ : నేను ఒకరకంగా 2004 నుంచి ప్రజాసేవలో ఉన్నా. డాక్టర్‌గా హైదరాబాద్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టా. అప్పుడే నాన్న కోరుట్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి నుంచి ప్రజలతో కలిసిపోయాను. 2009లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. మొదటి నుంచి మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాల ప్రజలతో కలిసే సాగాను. ఎన్నికలప్పుడు ప్రత్యక్షంగా ఉన్నా. 2014 నుంచి ఎన్నికల సమయంలో కోరుట్ల పట్టణ ఇన్చార్జిగా పనిచేశా. దాంతో ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మెగా వైద్యశిబిరాలు, ఉచిత శస్త్ర చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయించా. రౌండ్టేబల్ సంస్థ సహకారంతో పాఠశాలలు కట్టించా. మొదటి నుంచి ప్రజలతో కలిసే ఉన్నా. అందుకే వారికి మరింత సేవ చేయలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చా.
నమస్తే : కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం రావడంపై ఎలా ఫీలవుతున్నారు?
సంజయ్ : కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక కావడం నా జీవితంలోనే అత్యంత మధురమైన రోజు. దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు, తెలంగాణ సాధకుడు సీఎం కేసీఆర్ నోటి వెంట నా పేరు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. అంతటి మహానుభావుడు నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటా. నా నమ్మకంతో నాకు అప్పగించిన బాధ్యతలను వందశాతం నెరవేర్చి, కోరుట్లను ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతా.
నమస్తే : దేశంలోనే ప్రతిష్టాత్మకమైన దవాఖానలో స్పైయిన్ సర్జన్‌గా పనిచేస్తూ, మంచి ఆదాయం ఆర్జిస్తున్న మీరు ప్రజాక్షేత్రంలోకి రావడానికి కారణం?
సంజయ్ : మీరు సరైన ప్రశ్న అడిగారు. నేను రాజకీయాల్లోకి, ముఖ్యంగా ప్రజాక్షేత్రంలోకి రావడానికి కారణం సేవే. వైద్యుడిగా సేవ చేయడం అత్యుత్తమైనదే. అందులో ఎలాంటి సందేహం లేదు. వైద్యుడిగా ఇరవై ఏండ్లుగా సేవ చేస్తూనే ఉన్నా. విస్తృత దృష్టితో చూసినప్పుడు వైద్యుడు చేసే సేవ కేవలం వ్యక్తిగతమైంది. ఒక వైద్యుడిగా రోజుకు పది, పదిహేను మందికి మాత్రమే సేవ చేయగలం, కానీ ప్రజాక్షేత్రంలో ఉంటే సేవలు విస్తృతం అవుతాయి. ఎక్కువ మందికి మేలు చేసే అవకాశముంటుంది. అందుకే ప్రజాబాహుళ్యంలోకి రావాలని నిర్ణయించుకున్నా.
నమస్తే : ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై మీ వైఖరి?
సంజయ్ : చాలా కీలకమైన ప్రశ్న. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై ఇప్పటికే నాన్న పలుసార్లు ప్రభుత్వంతో, సీఎంతో మాట్లాడారు. నేను కూడా ప్రయత్నం చేశాను. మంత్రి కేటీఆర్‌కు నాకున్న సానిహిత్యంతో అన్ని పార్టీల్లోని సభ్యులతో కలిసి ఏర్పడిన రైతువేదిక నాయకులను ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లాను. రైతువేదిక నాయకులతో మంత్రి కేటీఆర్ గంటన్నరపాటు చర్చించారు. రైతులు కో ఆపరేటివ్ పద్ధతిలో ఫ్యాక్టరీని నిర్వహించేందుకు ముందుకురావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ సైతం అదే విషయం చెప్పారు. రైతులు ఈ విషయంపై ఆలోచన చేయాలి. భవిష్యత్తులో రైతువేదిక నాయకులు, సభ్యులతో చర్చించి, సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తా.
నమస్తే : మీ నాన్న హయాంలో జరిగిన అభివృద్ధిపైన అవగాహన ఉన్నదా..?
సంజయ్ : 2014 నుంచి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై పూర్తి అవగాహన ఉన్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శనం, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు హయాంలో కోరుట్ల నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది. వందేండ్లలో జరగని అభివృద్ధి ఈ పదేళ్లలో జరిగింది. తెలంగాణ రాక ముందు ఏటా ఎండకాలంలో కోరుట్ల, మెట్పల్లి ప్రజలు తాగునీటి కోసం గోస పడ్డారు. బిందెలతో రోడ్లెక్కారు. కానీ, స్వరాష్ట్రంలో ఆ సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. సాగునీటి గోస కూడా తీరింది. విద్యా, వైద్య పరంగా అభివృద్ధి చెందింది. కిడ్నీ బాధితులు డయాలసిస్ కోసం హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లకుండా కోరుట్లలోనే డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. 1300 కోట్లతో మిషన్‌భగీరథ, 63,287 నల్లా కనెక్షన్లు, 635 కిలోమీటర్ల పొడవున పైప్‌లైన్, 350 కోట్లతో పంచాయతీరోడ్లు, 262 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు, 125 కోట్లతో కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల అభివృద్ధి, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, 80వేలకు పైగా పింఛన్లు, ఒక్క బీడీ కార్మికులకే 35 వేల పింఛన్లు, కోరుట్ల, మెట్పల్లిలో వంద పడకల దవాఖాన, ఐసీయూ సెంటర్, ఆక్సీజన్ యూనిట్, డయాలసిస్ సెంటర్, పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు, మైనార్టీ, వెల్ఫేర్ గురుకులాల ఏర్పాటు జరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే కేసీఆర్ పాలన అనే రథానికి అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలు ఎలా ఉన్నయో..? ఇక్కడ నియోజక వర్గంలోనూ అదే రీతిలో వృద్ధి జరిగింది.
నమస్తే : నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ప్రణాళికలు ఏంటీ?
సంజయ్ : నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగింది. గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందాయి. అయితే నాకు కొన్ని ప్రాధాన్యాలు ఉన్నాయి. ఇప్పటికే వాటిపై కొంత ప్రయత్నం చేశాను. ముఖ్యంగా యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై దృష్టి సారించాలనుకుంటున్నా. ఇక్కడ ఇప్పటికే ఒక ఐటీ సంస్థను తెచ్చా. అది త్వరలోనే ప్రారంభమవుతుంది. ఒక వంద మందికి ఉపాధి లభిస్తుంది. అయితే భవిష్యత్తులో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. దాని ద్వారా యువతకు ఉద్యోగాలు వస్తాయి. సాంకేతిక కోర్సులకు సంబంధించిన ఉన్నత విద్యా సంస్థలను ఇక్కడ నెలకొల్పేలా చేయాలని అనుకుంటున్నా. వైద్యుడినైనా నా టాప్ ప్రయార్టీలు ఎడ్యుకేషన్, హెల్త్. ఉద్యోగాలు, ఉపాధి, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ఫ్యాక్టరీలు, సంస్థలు నెలకొల్పే దిశగా ప్రయత్నిస్తా.
నమస్తే : మీరు ఏమైనా సమస్యలు గుర్తించారా..?
సంజయ్ : ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. గడపగడపకూ ఫలాలను అందించింది. అయితే డబుల్ బెడ్రూంలకు సంబంధించి కొంత పురోగతి సాధించాల్సిన అవసరమున్నది. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తా. అలాగే గృహలక్ష్మి పథకంకింద సొంత స్థలాలు ఉన్నవారికి ప్రయోజనం కలిగించేలా చూస్తా. దీంతోపాటు కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ముంపు సమస్య ఉన్న ది. భారీ వర్షాలు పడినప్పుడు వరద ఇండ్లలోకి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాలువలు సరిగా లేకపోవడమే అందుకు కారణం. ఈసమస్యలను పరిష్కరించడం నా ప్రయార్టీ అంశాల్లో ఒకటి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

