Peddapally | మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్ పాడుచేసుకోవద్దు.. పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి
విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై గురువారం అవగాహన కల్పించారు.
Peddapally | అంతర్గాం, జనవరి 8 : విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై గురువారం అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా సేనో డ్రగ్స్ అనే నినాదంతో అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని టీటీఎస్, రామాలయం గ్రౌండ్ లో గురువారం గంజాయి మత్తుపదార్థాల నియంత్రణ, సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సేఫ్టీ పై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలతో విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష సాధన దిశగా అడుగులు వేయాలని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటే భవిష్యత్ అంధకారమవుతుందని చెప్పారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకుని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా వుండాలని వీటి వినియోగం వలన తమ జీవితాలను అంధకారం చేసుకోవడంతోపాటు, ఆరోగ్య, ఆర్థికపరంగా చాలా నష్టపోతారని తెలిపారు.
ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగిస్తున్న, విక్రయిస్తున్న తక్షణమే స్థానిక పోలీసులకు, నార్కోటిక్ విభాగం 1908 నంబర్ కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యం వుంచబడుతుందని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో నేర గాళ్ళు టెక్నాలజీ వినియోగించుకొని నేరాలకు పాల్పడుతున్నారని, గుర్తు తెలియని వ్యక్తుల నుండి మీ సెల్ ఫోన్లకు, ఈమెయిల్ కు వచ్చే సందేశాల పట్ల అప్రమత్తం వుండాలని, తెలియని వెబ్ సైట్లలో మీ వ్యక్తిగత సమాచారం, ఫొటోలను పోస్ట్ చేయొద్దని, ప్రధానంగా గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్ లైన్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపవద్దని చెప్పారు.
అలాగే పెట్టుబడులు పెట్టవద్దని డీసీపీ, ఏసీపీ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కళాబృందం సభ్యులు రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, మూఢనమ్మకాలు, గంజాయి వంటి మత్తుపదార్థాల వల్ల కలిగే అనర్థాలపై పాటల రూపంలో నాటకాల రూపంలో స్క్రిట్ చేసి ప్రజలలో అవగాహన చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, అంతర్గం ఎస్ఐ వెంకటస్వామి తో పాటు మండలం ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

