Dev Ji | దేవ్ జీ రాక మాకు సంతోషదాయకం.. ఆయన రాక కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నాం
మావోయిస్టు అగ్రనేత కోరుట్ల కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల ఎదుట లొంగిపాయరనే వార్తల నేపథ్యంలో తిరుపతి కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు.
- మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కుటుంబ సభ్యుల భావోద్వేగం
- సోషల్ మీడియా వేదికగా వీడియో షేర్ చేసిన దేవ్ జీ తమ్ముడు కూతురు సుమ
Dev Ji | కోరుట్ల ఫిబ్రవరి 22 : మావోయిస్టు అగ్రనేత కోరుట్ల కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల ఎదుట లొంగిపాయరనే వార్తల నేపథ్యంలో తిరుపతి కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. దేవ్ జీ రాక మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని దేవ్ జీ తమ్ముడు గంగాధర్ ఆనంద వ్యక్తం చేశారు. మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దేవ్ జీ తమ్ముడు, కూతురు సుమ సోషల్ మీడియా వేదికగా వీడియోలు షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. తమ పెద్దనాన్న దేవి లొంగిపోయారన్న వార్త నిజమైతే బాగుండుననే ఆశ.. ఇప్పుడు నిజమయ్యే రోజుకి వచ్చిందేమో.. అనిపిస్తుందని పేర్కొన్నారు. దేవీ జీ లొంగుబాటు వాస్తవమైతే..! అదీ కేవలం లొంగుబాటు కాదు.. అది ఎన్నో ఏళ్ల ఎదురుచూపు అంటూ.. తన వీడియోలో పేర్కొంది. తన అన్నని ఒక్కసారైనా చూడాలన్న తమ్ముడి కోరిక.. తన తండ్రి కోరిక నిజమైతే బాగుండునని కూతురిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
తమ పెద్దనాన్న రాక ఒక మనిషిగా కాదు, తమ ప్రపంచం తిరిగి వచ్చినట్టేనని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనే.. తమ ఆశ, ఒక నమ్మకం ఒక ధైర్యం అంటూ ఒక లేఖను కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఒకవేళ ఈ లొంగుబాటు వార్త నిజమైతే ఇది తమ కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నట్లు ఆ లేఖలో, వీడియోలో ఆమె తన స్పందనను సుమ తెలియజేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- dev ji
- Jagityal
- Karimnagar
- Korutla
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

