Jagityal | మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి.. జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్
జగిత్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల పురోగతిపై జగిత్యాల జిల్లా కలెక్టర్ బీ సత్యప్రసాద్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, విద్యార్థులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Jagityal | జగిత్యాల, నవంబర్ 26 : జగిత్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల పురోగతిపై జగిత్యాల జిల్లా కలెక్టర్ బీ సత్యప్రసాద్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, విద్యార్థులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలో చేపట్టిన వివిధ నిర్మాణ పనుల ప్రస్తుత స్థితిగతులు, ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశించిన గడువులోగా పనులన్నీ నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, విద్యా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాహుబలి కాంబో మరోసారి రిపీట్ కాబోతోందా …2028 తర్వాత రాజమౌళి భారీ ప్లాన్!
Elon Musk | ప్రతి చిన్నారికి రెండు స్పేస్ ఎక్స్ షేర్లు.. ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన..!
Padma devender reddy | రైతులతో మాట్లాడిన పద్మాదేవేందర్ రెడ్డి.. పంట నష్టంపై ఆరా
Tata Sons | టాటా సన్స్‌లో తీవ్రస్థాయికి నాయకత్వ వివాదం.. బాంబే హైకోర్టుకు టాటా ట్రస్టులు..!
Congress MLA | హామీలపై నిలదీసినందుకు మైనార్టీలపై చిందులేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

