Korutla | కోరుట్ల ఎమ్మెల్యేను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదు.. కోరుట్ల బీఆర్ఎస్ నాయకులు
అబద్ధాలు మాని, కోరుట్ల నియోజక అభివృద్ధికి సహకరించాలని కాంగ్రెస్ నాయకులకు కోరుట్ల బీఆర్ఎస్ నాయకులు హితవు పలికారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిషలు శ్రమిస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని వారు ధ్వజమెత్తారు.
Korutla | కోరుట్ల, నవంబర్ 3 : అబద్ధాలు మాని, కోరుట్ల నియోజక అభివృద్ధికి సహకరించాలని కాంగ్రెస్ నాయకులకు కోరుట్ల బీఆర్ఎస్ నాయకులు హితవు పలికారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిషలు శ్రమిస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని వారు ధ్వజమెత్తారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై అనవసర ప్రేలాపణలు మాని ఆసుపత్రిలో మౌళిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలన్నారు. ఇటీవల కోరుట్ల ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు కృష్ణారావు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌పై చేసిన అనుచిత వాఖ్యాలపై బీఆర్ఎస్ నాయకులు మండి పడ్డారు. కృష్ణారావు బేషరతుగా తాను చేసిన వ్యాఖ్యాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కోరుట్ల పట్టణ, పరిసర గ్రామాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఆశయంతో అప్పటి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు ప్రభుత్వాసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయించి రూ.కోట్లతో ఆధునాతన ఆసుపత్రి భవనాన్ని తీసుకువచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఆసుపత్రిలో కార్పోరెట్ సేవలు అందించేలా వైద్యులను నియమించి, వైద్య పరికరాలను ఏర్పాటు చేశారని చెప్పారు. కాంగ్రెస్ హయంలో ప్రజారోగ్యాన్ని విస్మరించారని, కోరుట్ల అసుపత్రికి అవసరమైన సామగ్రి, మందులను సరఫరా చేయకుండా వైద్యులను నియమించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని ఆరోపించారు. కోరుట్ల ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లిన ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా వైద్యులను నియమించాలని, వైద్య పరికరాలు అందించాలని పలుమార్లు అసెంబ్లీ సాక్షిగా మొరపెట్టుకున్న విషయం కాంగ్రెస్ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. కోరుట్ల ప్రజలపై కాంగ్రెస్ నాయకులు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వార్డు మెంబర్ గా కూడ గెలువని వ్యక్తులు ఎమ్మెల్యేపై విమర్శలు మాను కోవాలని సూచించారు. భవిష్యత్తులో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్లపై అనుచిత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు చీటీ వెంకట్రావు, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, పట్టణ మైనార్టీ మాజీ అధ్యక్షుడు సయ్యద్ ఫహీం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు పొట్ట సురేందర్, వసీం, మహేష్, మోసీన్, నాయకులు టేకుల నరేష్, నత్తి రాజ్ కుమార్, మహ్మద్ అతిక్, సజ్జు, నీలి శ్రీనివాస్, వనతడుపుల అంజయ్య, దొబ్బల వెంకటేష్, మిట్టపల్లి రాజశేఖర్, షేర్ అనిల్, దశరథం, అర్బాజ్, వాసిక్ ఉర్ రహ్మన్, మహేష్, అబుబాకర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆదివాసి గూడేలలో గుస్సాడీల సందడి
CM Vijay | పెరందురై సభలో విజయ్.. సీఎం భుజంపై చేయి వేసి ఫొటో దిగిన బామ్మ!
MLC Dasoju Sravan | తెలంగాణలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

