Ramagundam | రామగుండం బల్దియాలో కాంట్రాక్టర్ల గలాట.. టెండర్ విషయంలో పరస్పర దూషణలు బయటపడిన కాంట్రాక్టర్ల వర్గ పోరు
రామగుండం నగర పాలక సంస్థ కాంట్రాక్టర్ల మధ్య వర్గ పోరు బయటపడింది. నగర పాలక కార్యాలయంలోనే కమిషనర్ చాంబర్ వద్ద శుక్రవారం ఇరువురు కాంట్రాక్టర్లు గలాటకు దిగడం చర్చనీయాంశమైంది.
- హడలెత్తిన కార్యాలయ సిబ్బంది
Ramagundam | కోల్ సిటీ, నవంబర్ 6 : రామగుండం నగర పాలక సంస్థ కాంట్రాక్టర్ల మధ్య వర్గ పోరు బయటపడింది. నగర పాలక కార్యాలయంలోనే కమిషనర్ చాంబర్ వద్ద శుక్రవారం ఇరువురు కాంట్రాక్టర్లు గలాటకు దిగడం చర్చనీయాంశమైంది. ఓ టెండర్ విషయంలో పరస్పర దూషణలకు పాల్పడటం హడలెత్తించింది. ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. నగర పాలక సంస్థ రూ.50 లక్షల నిధులతో దాదాపు పదకొండు వందల ఇంకుడు గుంతల నిర్మాణాలకు సంబంధించి టెండర్ పిలిచింది. ఆ పనులకు టెండర్ దాఖలు విషయంలో ఇద్దరు కాంట్రాక్టర్ల మధ్య గొడవకు దారి తీసింది. ఆ పనులు తానే చేస్తాననీ, ఎవరు కూడా ఆన్లైన్ టెండర్ దాఖలు చేయవద్దంటూ కార్యాలయంకు వచ్చి ఓ కాంట్రాక్టర్ మరో కాంట్రాక్టర్ తో వారించారు. దీనితో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
మాట మాట పెరగడంతో అసలేం జరుగుతుందోనని కార్యాలయంలోని సిబ్బంది హడలెత్తిపోయారు. కార్యాలయంలో అందరు చూస్తుండగానే టెండర్ ఎలా వేస్తావో చూస్తా.. ఆ వర్క్ ఎలా జరుగుతుందో కూడా చూస్తా అంటూ హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా వర్క్ కు సంబంధించి టెండర్ల విషయంలో ఇప్పటివరకు కాంట్రాక్టర్లు బయటనే మంతనాలు జరుపుకొని పనులను దక్కించుకునేవారు. తాజాగా కార్యాలయంలోనే రూ.50లక్షల టెండర్ విషయంలో గలాటకు దిగడం, ఈ గొడవ ముదిరి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene Review | ‘సీన్’ సినిమా రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే!
Former Minister Talasani | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను వెంటనే విడుదల చేయాలి : మాజీ మంత్రి తలసాని
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Peptides | అమెరికా ఆరోగ్య రంగంలో కీలకమార్పు.. పెప్టైడ్ల వినియోగానికి గ్రీన్ సిగ్నల్.. ఏంటివి.. ఎలా పనిచేస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

