ఫలించిన కలెక్టర్ కృషి
వారంతా పదో తరగతి పరీక్షలు రాశారు.. రెండు, మూడు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు.. ఆ తర్వాత తిరిగి పరీక్ష రాయాలనే ఆలోచన వారికి రాలేదు.. పరీక్ష ఫీజు చెల్లించలేదు.. ఏదో ఓ పని చేసుకుందామనే భావనతో ఉన్నారు. పిల్లలు పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించి, వారిని ఉన్నత చదువులు చదివిద్దామనే ఆలోచన కూడా వారి తల్లిదండ్రులకు రాలేదు.
- టెన్త్ ఫెయిలైన వారిపై ప్రత్యేక శ్రద్ధ
- ఉత్తీర్ణత సాధించేలా ప్రోత్సాహం
- 95 మందిలో 72 మంది పాస్
- విద్యార్థులను అభినందించిన కలెక్టర్ పమేలా సత్పతి
కమాన్‌చౌరస్తా, మే 1: వారంతా పదో తరగతి పరీక్షలు రాశారు.. రెండు, మూడు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు.. ఆ తర్వాత తిరిగి పరీక్ష రాయాలనే ఆలోచన వారికి రాలేదు.. పరీక్ష ఫీజు చెల్లించలేదు.. ఏదో ఓ పని చేసుకుందామనే భావనతో ఉన్నారు. పిల్లలు పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించి, వారిని ఉన్నత చదువులు చదివిద్దామనే ఆలోచన కూడా వారి తల్లిదండ్రులకు రాలేదు. అలా రెండు, మూడేళ్లు గడిచాయి. వారిపై గత అసెంబ్లీ ఎన్నికల ముందు బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ పమేలా సత్పతి దృష్టి పడింది. కనీసం పదో తరగతి పాసైనా ఏదో ఓ చిరుద్యోగం సంపాదించి, ఉపాధి పొందుతారనే ఆలోచన కలెక్టర్‌కు వచ్చింది. వెంటనే విద్యార్థులను కన్విన్స్ చేసి పరీక్షలు రాయించి, పాస్ చేయించాలనే సంకల్పం తీసుకున్నారు. ఈ మేరకు వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమై, విద్యార్థులు పరీక్షలు రాసేలా ఒప్పించారు. వివరాలు తెలుసుకుని పరీక్ష ఫీజు చెల్లించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
వెంటనే రంగంలోకి దిగిన యంత్రాంగం జిల్లాలో ఫెయిలైన 124 మంది వివరాలు సేకరించింది. వారందరూ పరీక్షలు రాసేలా ఫీజులు చెల్లించారు. ఫెయిలైన సబ్జెక్టుల్లో ప్రత్యేకంగా ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించారు. వారు ఆయా సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా ప్రత్యేక దృష్టి సారించారు. వార్షిక పరీక్షకు అన్ని విధాలా వారిని సిద్ధం చేశారు. 124 మందిలో 95 మంది విద్యార్థులు కరీంనగర్‌లోని పురాతన ఉన్నత పాఠశాల, హుజూరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాశారు. ఇందులో 72 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 40 మంది బాలురు, 32 మంది బాలికలు ఉన్నారు. హాజరైన వారిలో 75.78 శాతం ఉత్తీర్ణత సాధించడంతో కలెక్టర్ కృషి ఫలించినైట్లెంది. కలెక్టర్ ఇచ్చిన ప్రోత్సాహం, తమపై చూపిన ప్రత్యేక శ్రద్ధతో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులమయ్యామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. మీ స్ఫూర్తితో తామంతా ఉన్నత చదువులు చదివి, అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తామనే దీమాను కలెక్టర్ ఎదుట వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

