గంభీరావుపేట, జూలై 4 : గంభీరావుపేట మండల పరిధిలోని మానేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు పరవళ్లు తొక్కుతున్నాయి.. ఇటీవల కురిసిన మోస్తరు వర్షానికే గలగలా పారుతున్నాయి.. పాల నురగల్లా దిగువకు వస్తున్న జలధారలు కనువిందు చేస్తున్నాయి.. చెక్‌డ్యాంల పరిసర ప్రాంతాల్లోని బోర్లు, బావులు జలకళను సంతరించున్నాయి.