Vemulawada | వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని ఆరెపల్లి వద్ద ఇస్కాన్ టెంపుల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు శుక్రవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణుని ఆశీస్సులు, కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు.
శ్రీకృష్ణుని బోధనలతో మీకు మనోధైర్యం లభించాలని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే ధైర్యాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలతో తదితరులు పాల్గొన్నారు.