Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 13 : వేములవాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాగరం వెంకటస్వామి తల్లి రామలక్ష్మి ఇటీవలే చెందింది. కాగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు వెంకటస్వామి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించి రామలక్ష్మి చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన వెంట మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచందర్ , నాయకులు గూడూరు మధు, సుంకపాక రాజు, మంత సందీప్, బొల్లం దేవరాజు, గోపు మధు తదితరులు ఉన్నారు.