Power Cuts | విద్యుత్ కోతలను నిరసిస్తూ ఓదెలలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఎదుట విద్యుత్ కోతలు నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు ఓదెల మండల కేంద్రంలో విద్యుత్ కోతులపై నిరసన తెలిపారు.
Power Cuts | ఓదెల, అక్టోబర్ 10 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఎదుట విద్యుత్ కోతలు నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు ఓదెల మండల కేంద్రంలో విద్యుత్ కోతులపై నిరసన తెలిపారు. రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటును కోతలు లేకుండా అందించి పంటలను కాపాడాలన్నారు.
ఓదెల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఓదెల నుండి సబ్ స్టేషన్ వరకు బైక్ లతో ర్యాలీగా వెళ్లి రోడ్డుపై ధర్నా చేశారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ రాజయ్యకు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికైనా రైతులకు నాణ్యమైన కరెంట్ అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బోడగుంట నరేష్, పోలోజు రమేష్, చింతం స్వామి, భోగే సదానందం, రాచర్ల కుమార్, బుద్ధ కుమార్, మార్క రమేష్, చింతం వెంకటస్వామి, సర్వర్, మహేందర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Odela
- Peddapally
- Power cuts
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

