బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గులాబీ జెండాలను ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లిలో గల కేసీఆర్ భవన్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు,
సిరిసిల్లలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జగిత్యాలలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీ చైర్‌పర్సన దావ వసంత, పెద్దపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
– నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 27