Kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్ ఫిబ్రవరి 17 : బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, సర్పంచులు సదాశివరెడ్డి నాగరాజు, రాజయ్య, రాణి, బీఆర్ఎస్వై మండల అధ్యక్షుడు నూనె కుమార్, నాయకులు ఆడెపు రాజు , నిదానపురం దేవయ్య, ఆకుల స్వామి, వివేక్, జెట్టి దేవేందర్, కార్కూరు సత్యనారాయణ, మాదాసి రామచంద్రం, వెంకటరెడ్డి, నాగార్జున రావు తదితరులు పాల్గొన్నారు.