Bridge construction | చందుర్తి, సెప్టెంబర్ 29 : పాలకుల వివక్షత అధికారుల నిర్లక్ష్యంతో ఎన్గల్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామస్తులు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మోకిలే విజేందర్ మాట్లాడుతూ ఎన్గల్ లో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులతో కలిసి నిరసన చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం మారినా సమస్యలు తీరకపోగా ఏళ్లు గడిచినా అంతర్గత రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టకపోవడం తో రైతులు,గీత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ గ్రామపంచాయతీ సాక్షిగా చేసిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. ఎన్గల్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బ్రిడ్జ్ నిర్మాణంలు వెంటనే చేపట్టాలని లేనిచో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి దీక్ష చేపడతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.