Bhuvan survey | రామగుండంలోని ఇండ్లు, భవనాలకు జియో ట్యాగింగ్‌కు భువన్ సర్వే
గోదావరిఖని నగరంలోని ఇళ్లు, భవనాల వివరాలను సేకరించి జియో ట్యాగింగ్ సర్వే ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు పన్ను వసూళ్లలో మరింత వేగం పెంచాలని అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ ఆదేశించారు.
- పన్ను బకాయి దారులకు రెడ్ నోటీసులు జారీ
- రామగుండం నగరపాలక కమిషనర్ జే అరుణశ్రీ వెల్లడి
Bhuvan survey | కోల్ సిటీ, అక్టోబర్ 23 : గోదావరిఖని నగరంలోని ఇళ్లు, భవనాల వివరాలను సేకరించి జియో ట్యాగింగ్ సర్వే ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు పన్ను వసూళ్లలో మరింత వేగం పెంచాలని అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ ఆదేశించారు. వార్డు అధికారులు, సహాయకులు, రెవెన్యూ విభాగం సిబ్బందితో పన్ను వసూళ్ల పురోగతిపై శుక్రవారం సాయంత్రం నగర పాలక కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నగర పాలక సంస్థ ఆదాయం మెరుగుపరచడానికి లక్ష్యం ప్రకారం ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, లైసెన్సు ఫీజులు వసూలు చేయాలన్నారు.
అనుమతి లేని కట్టడానికి వంద శాతం పెనాల్టీ విధించాలన్నారు. నివాస గృహ అనుమతి పొంది తదుపరి వాణిజ్య భవనాలుగా మార్చిన వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. దీర్ఘకాలంగా పన్ను బకాయిలు ఉన్న వారికి రెడ్ నోటీసులు జారీ చేయడంతోపాటు చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. ఇళ్లు, భవనాల వివరాలను సేకరించి జియో ట్యాగింగ్ చేయడానికి నిర్వహిస్తున్న భువన్ సర్వే శనివారం నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, సెక్రెటరీ మహేశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, ఆర్ ఐ ఖాజా, జూనియర్ అసిస్టెంట్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

