Mulkanoor | ముల్కనూరులో మత్తు పదార్థాల నివారణపై అవగాహన
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో మోడల్ స్కూల్ (ఆదర్శ పాఠశాల)లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణ పై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు.
Mulkanoor | చిగురుమామిడి, సెప్టెంబర్ 24 : చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో మోడల్ స్కూల్ (ఆదర్శ పాఠశాల)లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణ పై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ హర్షిత్ కౌర్ అధ్యక్షత వహించారు. మహిళా సాధికారత కేంద్రం జండర్ స్పెషలిస్ట్ కవిత, మిషన్ వాత్సల్య అధికారి సాదినేని రమేష్, చైల్డ్ హెల్ప్ లైన్ సాయికిరణ్ హాజరై మాట్లాడుతూ మత్తు పదార్థాలు డగ్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలను కుటుంబం పై భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు. మత్తు పదార్థాలు అలవాటు పడకుండా వాటిని పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకూడదని అన్నారు. వ్యక్తిగత వివరాలు ఫోటోలు ఇతర సమాచారాన్ని ఇవ్వకూడదని సూచించారు.
సోషల్ మీడియా ద్వారా అనుమానాస్పద సందేశాలు లింకులు వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొని విద్యపై దృష్టి పెట్టి మంచి భవిష్యత్ను నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం పోషక మాసం కార్యక్రమంలో భాగంగా పోషకాహారంపై పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ రోమీల మాట్లాడుతూ విద్యార్థులు ప్రతీరోజు సమతుల్యమైన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. పోషక ఆహారం తీసుకోవడం ద్వారా శారీరిక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ఎదుగుదలకు ఏకాగ్రతకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం పోషకాహారం అంశంపై క్విజ్ పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ ప్రణీత, ఉపాధ్యాయులు, పోలీసులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

