Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 19 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో వార్డు సభ్యురాలుగా ఎన్నికైన కారపూరి తారతో పాటు ఆమె భర్త వెంకటేశంను రేకొండ అసోసియేషన్ సభ్యులు గురువారం శాలువాతో ఘనంగా సత్కరించారు.
గ్రామంలో వెంకటేశం అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడంతో గుర్తింపుగా భార్యాభర్తలకు అసోసియేషన్ సభ్యులు ఘనంగా శాలువాతో సన్మానించారు. సన్మానించిన వారిలో సభ్యులు కుమారస్వామి, శ్రీనివాస్, సమ్మయ్య, అంజయ్య, రవీందర్, సుదర్శన్, తిరుపతి, రాములు, తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.