జగిత్యాల కలెక్టరేట్, జూన్ 17 : జగిత్యాల ఎస్పీగా 2019 బ్యాచ్‌కు చెందిన అశోక్ కుమార్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న అశోక్‌కుమార్‌ను జగిత్యాల ఎస్పీగా, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సన్‌ప్రీత్ సింగ్‌ను సూర్యాపేట ఎస్పీగా బదిలీ చేశారు. గతేడాది అక్టోబర్‌లో ఎస్పీగా వచ్చిన సన్‌ప్రీత్ సింగ్ జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించారు.