Appointed | చిగురుమామిడి, మార్చి 22 : తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డు అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ బొల్లి ఐలయ్య ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్లో తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్లో మలయాళ రామస్వామి స్టేట్ ప్రధాన కార్యదర్శి, స్టేట్ కరాటే కోశాధికారి మల్లికార్జున్ గౌడ్, సీనియర్ కరాటే మాస్టర్ రాపోలు సుదర్శన్ చేతుల మీదుగా జిల్లా కార్యదర్శిగా నియామక పత్రాన్ని ఆయన ఆదివారం స్వీకరించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డాక్టర్ బొల్లి ఐలయ్య మాట్లాడుతూ కరాటేలో 20 సంవత్సరాలుగా తను చేసిన సేవలను గుర్తించి నియామకం చేసినట్లు ఆయన తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.